హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త :
మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ప్రభుత్వ విప్,గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి మకర జ్యోతి దర్శనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరు కాగా ఆలయ నిర్వహకులు నూలు నరసింహారావు ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే యార్లగడ్డ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, అష్టాదశ కలశారాధన తదితర పూజలను యార్లగడ్డతో చేయించారు. అనంతరం ఆలయంలోని పదినెట్టాంబడి మెట్లకు పూజలు చేసి ప్రతి మెట్టు పైన కలశాలను ఉంచి కర్పూర హారతిని వెలిగించారు. ఈ సందర్భంగా మేళ తాళాలు బాణాసంచా నడుమ 58 కేజీల కర్పూరంతో మకర జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి బాలవర్ధన రావు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, వీరమాచినేని సత్యప్రసాద్, దయ్యాల రాజేశ్వరరావు, చింతల వెంకట శివ అప్పారావు, వేగిరెడ్డి పాపారావు, గుండపనేని ఉమా ప్రసాద్, మూల్పూరి సాయి కళ్యాణి, నండూరి సత్య వెంకట శర్మ, కొమ్మారెడ్డి రాజేష్, మున్నంగి బాబురావు, జాస్తి భూపతి, కేతినీడి జైనేంద్ర తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News