Breaking News

జిఎంసి సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భోగి పండుగ ప్రతి ఇంటిలో భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి మేళం, హరిదాసుల కీర్తనలతోపాటు టగ్ ఆఫ్ వార్ లో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తరతరాల నుంచి వచ్చిన తెలుగు సంప్రదాయ పద్దతులను, క్రీడలను నేటి తరం పిల్లలకు అందించేలా జిఎంసి పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నసంక్రాంతి సంబరాలకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఆదరణ కోల్పోతున్నఆటలను తిరిగి పరిచయం చేయడానికి సంక్రాంతి సంబరాలు ప్రధాన వేదికగా మారాయని, ప్రతి ఆటలో సంస్కృతితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంన్నారు.
ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ సంస్కృతి,సాంప్రదాయం ఉత్సాహం కలిసిన సంక్రాంతి వేడుకల్లో ప్రజలతో కలిసి ఆనందంగా గడపడం మర్చిపోలేని అనుభూతన్నారు. మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకుంటూ, పండుగలను ఐక్యతతో జరుపుకోవడం మనందరి బాధ్యతని, గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.
తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్ (నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం)లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్ళు, గోలీలాట, గంగిరేద్దుల విన్యాసాలు, కోలాటం, డప్పుల వాయిద్యాలు, మహిళల నృత్యాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నూతన ఉతేజాన్ని ఇస్తున్నాయని, సంబరాల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారన్నారు. మహిళలు సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా వారి సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి గురువారం జరిగే సంబరాల్లో కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *