-రిజర్వేషన్ల పై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశవ్యాప్తంగా పోరాడుతాo
-ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా లోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలి
-బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి
-బీసీ రిజర్వేషన్ల పెంచి ప్రధాని నరేంద్ర మోడీ బీసీల రుణం తీర్చుకోవాలి
-బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ నిర్వహించాలి
-బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పాలి
-బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ రక్షణ చట్టంపై త్వరలోనే విజయవాడలో బీసీల మేధో మదన సమావేశo నిర్వహిస్తాం
-మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావుల వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్ పై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ ఒకటే ఏకైక పరిష్కార మార్గమని, రాజ్యాంగ సవరణ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు లు ఇరువురు సీఎంలకు విజ్ఞప్తి చేశారు
నేడు విజయవాడ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి ఎస్ ఎన్ మూర్తి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు లు పాల్గొని మీడియాతో మాట్లాడారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని 11 రాష్ట్రాలలో తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారని అయినప్పటికీ గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వలన రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని తీర్పు ఇచ్చిన దరిమిలా బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా పోయిందని వారు తెలిపారు
దేశంలో ఎస్సీ, ఎస్టీలకు అలాగే చివరికి అగ్ర కులాలకు కూడా జనాభా దామషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని బీసీలకు మాత్రమే జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు కల్పించకుండా అత్యల్ప శాతం కల్పిస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పుడు దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం అమలు జరుగుతున్న ఇవేమీ పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే 50% పరిమితి అంటూ గగ్గోలు పెడుతు బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు
తెలంగాణలో సమగ్ర కులగనన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన నేటి వరకు అమలు జరగడం లేదని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని ఎందుకోసం తక్షణమే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల పైన భౌతిక దాడులు, సామాజిక బహిష్కరణలు, కులం పేరుతో దూషణలు జరగకుండా సామాజిక రక్షణ కల్పించడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించడం చాలా అభినందనీయమని ఇదే సమయంలో భవిష్యత్తులో కోర్టులలో ఈ చట్టం వీగిపోకుండా ఉండడానికి సమగ్రమైన చట్టాన్ని రూపొందించి న్యాయ వివాదాలకు తావు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడుకు వారు విజ్ఞప్తి చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరహాలోనే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు
బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసే ప్రయత్నం చేస్తామని ఇదే సమయంలో ఏపీ తెలంగాణ సీఎంలు ఇరువురు అఖిలపక్షం తో ఢిల్లీకి వెళ్లి భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ నిర్వహించాలని ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ రిజర్వేషన్లు పెంపు కోసం ఢిల్లీలో చక్రం తిప్పాలని వారు కోరారు
బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ రక్షణ చట్టంపై సంక్రాంతి పండుగ తర్వాత విజయవాడలో బీసీల మేధో మదన సమావేశo నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసిన శంకర్రావు లు వెల్లడించారు
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్వి రావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, సుబ్బ రావు, బాదన్న బాబయ్య, రాంబాబు, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News