విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 10 లక్షల మంది కిశోర బాలికలకు రుతుక్రమ సమయంలో వచ్చే ఇబ్బందులకు చరమగీతం పాడేందుకు స్వేచ్ఛ అనే వినూత్న పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
మంగళవారం పటమట బాలుర జడ్ పి ఉన్నత పాఠశాల నుంచి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతో కలసి జిల్లా కలెక్టర్లతో వర్చ్యువల్ పద్దతిన స్వేచ్ఛా కార్యక్రమాన్ని ప్రారభించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసి (అభివృద్ధి) ఎల్.శివశంకర్, విజయవాడ సెంట్రల్ ఎంఎ మల్లాది విష్ణు, ఎంఎల్ సి కరిమున్నీసా, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వివిద కార్పొ రేషన్ చైర్మన్లు మేకతోటి గౌతమ్ రెడ్డి, శ్రీకాంత్, గీతాంజలీ దేవి, పద్మావతమ్మ, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్లు జి.కృష్ణంరాజు, గరికపాటి శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో 23 శాతం మంది బాలికలు రుతుక్రము సమయంలో వచ్చే ఇబ్బందుల వల్లే మధ్యలో చదువు నిలిపివేస్తున్నారని యునైటెడ్ నేషన్స్ తన నివేదికలో చెప్పిందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. వారు పడుతున్న ఇబ్బందులను కూడా గుర్తించిందన్నారు. అందుకే రాష్ట్రంలోని 10 లక్షల మంది కిశోర బాలికలకు 32 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేసే పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ పథకం కింద ప్రతి నెల 10, ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్లను పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం పాఠశాలల్లోని మహిళా టీచర్ కు ప్రత్యేకంగా నేప్కిన్ల పంపిణీ బాధ్యతను అప్పగించామన్నారు. రుతుక్రమ సమయంలో తలెత్తే ఇబ్బందుల పై మాట్లాడుకునే పరిస్థితి మహిళల్లో రావాలన్నారు. అందుకోసం పాఠశాలల స్థాయి నుండే అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయాల్లోని స్త్రీశిశు సంక్షేమ సంరక్షకురాలు, మహిళా పోలీస్ అందరూ కలసి పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తూ, దిశ యాప్ పై కూడా ప్రత్యేకంగా చర్చించాలన్నారు. దిశ యాప్ ను ప్రతీ మహిళ డౌన్లోడ్ చేసుకొని కష్ట సమయాల్లో వాడాలన్నారు. స్త్రీశిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ , విద్యాశాఖలకు ప్రత్యేక బాధ్యతలను మోపారు. జేసి ఆసరా ఈ శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం కోరారు. అలాగే వాడిన నేప్కిన్ను పర్యావరణానికి ఎలాంటి భంగం కలగకుండా వాటిని ఇన్ సినెరేటర్ల ద్వారా బూడిద చేసే ప్రక్రియను కూడా విస్తృతంగా చేపడుతున్నామన్నారు. అలాగే చేయుత మహిళా స్టోర్ల ద్వారా గ్రామీణ మహిళలకు విస్సర్ నైల్ బ్రాండెడ్ శానిటరీ నేప్కిన్స్ తక్కువ ధరకే అందజేస్తామన్నారు. దీని ద్వారా మహిళ ఆరోగ్యం. చేయూత దుకాణాలు పెట్టుకున్న మహిళలకు వనరులు కూడా చేకూర్చినట్లవుతుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు చదువులకు దూరం కాకుండా స్వేచ్చా కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. జిల్లాలోని 80 వేల మంది కిశోర బాలికలకు బ్రాండెడ్ నేప్కిన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. నెలకు 10, ఏడాదికి 120 చొప్పున నేప్కిన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మహిళా టీచయు నియమించారన్నారు. బాలికలు బాగా చదువుకోవాలని ప్రభుత్వం ఇబ్బందులను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తుందన్నారు. నాడు-నేడు పథకం కింద జిల్లాలోని 1153 పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో ప్రత్యేక టాయిలెట్లను కూడా నిర్మించిందన్నారు. అలాగే క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జేడి మధుసూధనరావు, డిఇఓ త హెరా సుల్తానా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమారాణి, సర్వశిక్షా అభియాన్ ఏపీసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …