రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, గురువారం బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ ను సందర్శించడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)- 2026 కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధం అనీ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది, దీనితో పాటుగా ఆటో రిక్షా వాహనదారులకు సంభందిత వాహన పత్రాలు (పర్మిట్ / ఫిట్నెస్ లైసెన్సు / ఇన్షూరెన్స్ ) తప్పనిసరిగా చెల్లుబాటులో వుండాలని మరియు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత, బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, ఎం. రవి కుమార్, జి. రామ్ నారాయణ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, బి ఉమా మహేశ్వర రావు, జి. ప్రణీత్ కుమార్ పి.వి.వి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News