Breaking News

న్యాయ సేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి మరియు సివిల్ జడ్జి సయ్యద్ జియో ఉద్దీన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయ సేవాధికార సంస్ధలో ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అన్నారు.  డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు అభ్యర్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని, కంప్యూటర్ నాలెడ్జ్, టైప్ రైటింగ్ నాలెడ్జి కలిగి ఉండాలని., ఎమ్మెస్ ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్ రంగాల్లో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం ఉండాలని చెప్పారు.

ఈ పోస్టులకు అభ్యర్థులు జనవరి 27వ తేదీలోగా తమ దరఖాస్తులను గుంటూరు జిల్లా కోర్టులో అందే విధంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లో పంపించాలని చెప్పారు. వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్ ను http//Guntur.dcourts.gov.in  సందర్శించవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *