Breaking News

అత్యద్భుతంగా కొనసాగిన సాంస్కృతిక ప్రదర్శనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు అత్యద్భుతంగా కొనసాగాయి. గుజరాత్ రాష్ట్ర కళాకారులు గూమర్ సాంప్రదాయ నృత్యాలు అద్భుతంగా ప్రదర్శించారు. పొన్నూరు శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్, కళాకారులు భక్తి, సినీ, డీజే పాటలకు హుషారుగా కోలాట ప్రదర్శన చేశారు. ఫిరంగిపురం కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన బాలికలు జానపద, డప్పు , నృత్యాలు, కోలాటం ప్రదర్శించారు. డీఆర్డీఏ ఎపీఎం నాగేశ్వరరావు సినీ గీతాలు, రేష్మా జానపద నృత్యం ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు  వీక్షించారు.
సరస్ మేళా లో శనివారం ప్రదర్శనలు
సరస్ మేళా లోని కళావేదికపై శనివారం   సాయంత్రం 6 గంటల  నుంచి తమిళనాడు రాష్ట్ర కళాకారులచే కరకట్ట సాంప్రదాయ నృత్య ప్రదర్శన, విశాఖపట్నం జిల్లా వారి జాలరి నృత్యం , కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *