గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంప్రదాయ డ్రస్ పోటీలు, చెక్క భజన, కోలాటం, అంబికా బృందం మ్యూజికల్ నైట్, డ్యాన్స్ లు, తంబోలా గేమ్ ప్రజలను విశేషంగా అలరించాయి. సాంప్రదాయ డ్రస్ పోటీల్లో పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తంబోలా గేమ్ చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మ్యూజికల్ నైట్ లో భాగంగ అంబికా బృందం గేయాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ నెల 11 నుండి జరిగిన సంక్రాంతి సంబరాలు నగర ప్రజలకు, పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాన్నిచాటాయి.
Prajavartha Online Telugu News