-కుటుంబ సమేతంగా వెంకటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, కుమార్తె – అల్లుడు శీలం కృష్ణప్రభ-అశ్విన్ కుమార్ దంపతులు, కుమారుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు తిరుమలేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి వెంట మనుమరాండ్రు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News