తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శెట్టిపల్లి ప్లాట్లు కేటాయింపు ధ్రువీకరణ పత్రం జారీ విధానంపై ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తుడా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఎలాంటి పొరపాట్లు జరగకుండా శెట్టిపల్లి లబ్ధిదారులకు తగు జాగ్రత్తలు తీసుకొని ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తుడా కార్యదర్శి డా. శ్రీకాంత్ బాబు, భూ సేకరణ అధికారి సుజన, ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి రామ్ కుమార్, తాసిల్దార్ సురేష్, ఎస్ ఈ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News