గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసేలా కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శనివారం గుంటూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కే. మయూర్ అశోక్ కి సూచించారు. తొలుత కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ ని శాలువా కప్పి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో వార్డుల వారీగా అభివృద్ధి పనులు వివిధ దశలలో ఉన్నాయని వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. అలాగే ప్రజలకు కీలకమైన త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం పనుల పై అధిక ద్రుష్టి సారించాలన్నారు. గుంటూరు నగరం రాజధాని పరిధిలో ఉన్నందున, దానికి తగ్గట్టుగా నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయుటకు కృషి చేయాలన్నారు.
Prajavartha Online Telugu News