గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా కె.మయూర్ అశోక్ శనివారం బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ ఏ.తామీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందల్ మర్యాదపూర్వంగా కలిసి, నగర అభివృద్ధి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. తొలుత కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, అధికారులు, సిబ్బంది, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. అనంతరం జరిగిన విభాగాధిపతుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం చివరికి వస్తున్నందున పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సోమవారం నుండి ప్రతి విభాగం సమగ్ర సమీక్ష చేస్తామని, అందుకు తగిన విధంగా సమాచారం సిద్దం చేయాలన్నారు.
Prajavartha Online Telugu News