Breaking News

గుంటూరు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సరస్ మేళా విజయవంతంగా నిర్వహణ

-కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణతో మేళాకు పటిష్ట ఏర్పాటు
-మేళా ను దాదాపు 13 లక్షల మంది వరకు సందర్శన
-ఆదివారంతో ముగియనున్న సరస్ మేళా
-స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు మేళా ఏర్పాటుపై ప్రశంసలు
-జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖతోపాటు, మున్సిపల్, పోలీస్, వైద్యారోగ్య , అగ్నిమాపక, విద్యుత్తు శాఖల సమన్వయంతో కృషి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా బ్రాండ్ ఇమేజ్ ని దేశ స్థాయిలో మరోసారి పెంచేలా జిల్లా యంత్రాంగం సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణతో మేళా ఏర్పాటు స్థలం గుర్తింపుతో పాటు, స్టాల్స్ ఏర్పాటు, నిర్వహణపై అమలు చేసిన ప్రణాళిక సత్ఫలితాలు ఇచ్చింది. రెడ్డి కళాశాల సమీపంలో 12 ఎకరాల్లో 320కి పైగా స్టాల్స్ తో ఫుడ్ కోర్ట్, ఎంమ్యూజ్మెంట్ పార్క్, కళా వేదిక, శిక్షణా కేంద్రం తో సరస్ మేళా ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల, ప్రదర్శన అమ్మకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల సహకారంతో సరస్ మేళా ను ఏర్పాటు చేశారు. దీనిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 65 స్టాల్స్, డిఆర్డిఏ, మెప్మా, నాబార్డ్ ఆర్థిక సహకారంతో వ్యాపారాలు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాలకు చెందిన స్టాల్స్ 180 కి పైగా , మరికొన్ని ఇతర స్టాల్స్ ఉన్నాయి. వీటిలో హ్యాండీక్రాఫ్ట్స్ 74, హ్యాండ్లూమ్స్ 95, న్యాచురల్ ఫుడ్స్ 76, బ్యాంకర్స్ కు సంబంధించి 20, ఇతర స్టాల్స్ ఉన్నాయి. ప్రాంగణంలో 12 రాష్ట్రాలకు చెందిన 18 స్టాల్స్ లైవ్ కిచెన్ తో  ఏర్పాటు చేశారు. ఎంమ్యూజ్మెంట్ పార్కులో ను పిల్లల కోసం బోటింగ్, రంగుల రాట్నం, వీఆర్ గేమ్స్ తదితర ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రసిద్ధ కళారూపాలను ప్రదర్శించారు. మేళా ను దాదాపు 13 లక్షలకు పైగా ప్రజలు సందర్శించారు. శెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో లక్షకు పైగా ప్రజల రద్దీ ఉన్న జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లతో మేళా సజావుగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ప్రతిరోజు మేళాను సందర్శించి ప్రజల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు పై స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు మేళా ఏర్పాటుపై ప్రశంసలు అందిస్తున్నారు. జనవరి 6 నుంచి జరుగుతున్న సరస్ మేళా జనవరి 18 ఆదివారం తో ముగియనున్నది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖతోపాటు, మున్సిపల్, పోలీస్, వైద్యారోగ్య , అగ్నిమాపక, విద్యుత్తు తదితల శాఖల సమన్వయంతో కృషి
మేళా ను విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇతర శాఖ సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. మేళాలో స్టాల్స్ నిర్వాహకులకు వసతి, భోజన సౌకర్యం, స్టాల్స్ లో కావలసిన మౌళిక సౌకర్యాలకు, స్వయం సహాయ సంఘాల సభ్యులకు శిక్షణ, ఇతర శాఖల అధికారులు సమన్వయం, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ, సందర్శకులకు మార్గ నిర్దేశం తదితర కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా గ్రామీణ అభివృద్ధి, మెప్మాకు సంబంధించి  ఏపీడి తో పాటు జిల్లాలోని అందరూ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, జిల్లా, మండల సమాఖ్య సభ్యులు విధులు నిర్వహించారు. .
నిరంతరంగా పారిశుద్ధ్య కార్యక్రమం
ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీల పర్యవేక్షణలో ప్రతి షిఫ్ట్ కి 50 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్ ల్లో విధులు నిర్వహించారు. ప్రతి స్టాలు వద్ద డస్ట్ బిన్ లు ఏర్పాటుతోపాటు ప్రాంగణ మొత్తాన్ని నిరంతరం శుభ్రపరుస్తూ విజిబుల్ క్లీన్ గా ఉంచారు. అదేవిధంగా ప్రాంగణంలో సందర్శకుల కోసం ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.
పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు
మేళా వద్ద జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో సౌత్ జోన్ డీఎస్పీ బానోదయ ఆధ్వర్యంలో నల్లపాడు సీఐ, ముగ్గురు ఎస్ఐలు, 40 మంది పోలీస్ సిబ్బందితో 24 గంటలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ప్రజల రద్దీ అధికంగా ఉన్న రహదారిపై ట్రాఫిక్ జాం లేకుండా, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం, ప్రాంగణంలో క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణ సక్రమంగా చేపట్టారు ‌ అదేవిధంగా శాంతి భద్రతల సమస్యలు లేకుండా పూర్తి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, రాత్రి వేళల్లో స్టాల్స్ వద్ద పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ వైద్య అధికారులు, ఎఎన్ఎం, అషాలతో ప్రాంగణంలో రెండు మంచాలతో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. స్టాల్స్ నిర్వహుకులతో పాటు, సందర్శకులకు వైద్య సలహాలతో పాటు, అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ప్రత్యేకంగా అంబులెన్స్ ను అత్యవసర వైద్య సేవల కోసం అందుబాటులో ఉంచారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్ని మాపక శాఖ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో గుంటూరు 2 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్ మెన్ , డ్రైవర్ ఆపరేటర్, ఇద్దరు ఫైర్ మెన్లు , ఒక ఫైర్ ఇంజన్ తో 24 గంటలు మేళాలో ప్రత్యేకంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్లు స్టాల్స్ నిర్వాహకులకు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , సాయంత్రం భోజనాలు సజావుగా అందించేలా పరివేక్షించారు.
వీరితోపాటు విద్యుత్, జిల్లా పరిషత్, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, బ్యాంకర్లు, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ , రెవెన్యూ శాఖలు అధికారులు ఉద్యోగులు సిబ్బంది విధులు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *