విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (B.A) కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పలువురు యువతీ యువకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాక్షిగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ IRS (Rtd) మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యలు మరియు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు RPI (BA) వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Prajavartha Online Telugu News