Breaking News

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీవెన్స్ ద్వారా అందిన అర్జీలు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సర్వే శాఖకు సంబంధించిన రీ–ఓపెన్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, వాటిని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)తో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వాటిపై తక్షణ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, అన్ని అర్జీలను నిర్ణీత గడువులో, ఎస్‌ఎల్‌ఏ పీరియడ్‌లోపే నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీ పరిష్కారం అనంతరం తప్పనిసరిగా ఎండార్స్మెంట్ జారీ చేయాలని, క్షేత్రస్థాయిలో జారీ చేసే ఎండార్స్మెంట్లు నాణ్యతతో ఉండేలా సంబంధిత హెచ్‌ఓడీలు పర్యవేక్షించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 147 అర్జీలు దరఖాస్తులు వచ్చాయన్నారు. శాఖల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్ – 62), పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (59), హోం శాఖ (9), వైద్య & ఆరోగ్య శాఖ తదితర శాఖల (17), అర్జీలు నమోద య్యాయన్నారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్‌లో స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా రెవెన్యూ (62) లో భూ ఆక్రమణ ఫిర్యాదులో , రికార్డ్ ఆఫ్ రైట్స్ – RoR (14), రీ సర్వే / SSLR (11), 22(A) జాబితా నుండి తొలగింపు అభ్యర్థనలు (8), రీ సర్వే సంబంధిత ఫిర్యాదులు (6), అసైన్‌మెంట్లు, జనరల్ సర్వే, GSWS/మీ సేవ, ఎన్‌క్రోచ్‌మెంట్లు, దేవాదాయ–చౌల్ట్రీ పరిపాలన, ఎఫ్‌లైన్ (సరిహద్దు నిర్ధారణ) తదితర అంశాలకు చెందిన 23 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి కె భాస్కర్ రెడ్డి, ఎస్డీసీ వి. భాగ్యవతి, డీఎస్పీ భవ్య కిషోర్, డి ఎల్ డి వో పి వీణా దేవి, ఏ స్లివా రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *