Breaking News

ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు లబ్ధిదారులకు సుమారు రూ.7 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్‌ఓసీ (LOC) పత్రాలను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధవరం గ్రామానికి చెందిన వల్లె రామారావు గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.3,04,687, అలాగే వీరపనేని గూడెం గ్రామానికి చెందిన పఠాన్ రిహాన్ ఖాన్ గారికి రూ.4,00,807 చొప్పున ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడుతూ, ఆపద సమయంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తూ, అవసరమైన వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *