Breaking News

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలి

-ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పీజీ పూర్తి చేసిన వైద్యులు ప్రభుత్వ సేవలకే కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నదే ఈ జీవోల ప్రధాన ఉద్దేశం
-ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రంగానికి వెళ్లిన వైద్యులపై చర్యలు చేపట్టి, 57 మందికి నోటీసులు జారీ చేశాం
-నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిగ్రీ రద్దు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను వడ్డీతో సహా వసూలు చేస్తాం
-గ్రామీణ ప్రాంతాల్లో, జాతరలు జరిగే ప్రాంతాల్లో హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-ఆంధ్రప్రదేశ్ శాసన సభ లెజిస్లేషన్ కమిటీ ఛైర్పర్సన్ తోట త్రిమూర్తులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు క్షేత్రస్థాయిలో అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ లెజిస్లేషన్ కమిటీ ఛైర్పర్సన్ తోట త్రిమూర్తులు తెలిపారు.

మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్,అసిస్టెంట్ సెక్రటరీ మరియు కమిటీ ఇంచార్జ్ విశ్వనాథం, ఏ పి ఎస్ ఏ సి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠ రెడ్డి ల తో కలిసి సమావేశం నిర్వహించి విస్తృతంగా చర్చించిన అనంతరం ఛైర్పర్సన్ పాత్రికేయులతో మాట్లాడుతూ… ఈ సమావేశంలో జీవో నంబర్ 85, 127, 311 అమలుపై మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ విస్తృతంగా కమిటీ సభ్యులతో కలిసి చర్చించామని తెలిపారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించడమేనని పేర్కొన్నారు. సమావేశం సుమారు 8 మంది కమిటీ సభ్యులతో నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు వివరించగా, జీవో నెం.85లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా తరువాత జీవో నెం.127లో కొన్ని సవరణలు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఇన్–సర్వీస్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ అంశంపై మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పీజీ పూర్తి చేసిన వైద్యులు ప్రభుత్వ సేవలకే కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నదే ఈ జీవోల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రంగానికి వెళ్లిన వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారని ఇప్పటివరకు 57 మంది వైద్యులకు నోటీసులు జారీ చేయగా, కొందరి వద్ద నుంచి రికవరీ కూడా ప్రారంభమైందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిగ్రీ రద్దు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను వడ్డీతో సహా వసూలు చేయడం, అవసరమైతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని అన్నారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేకెన్సీలు లేకపోవడం వల్ల కొంతమంది ఎంబీబీబీఎస్ వైద్యులకు అవకాశాలు కల్పించలేని పరిస్థితి ఉందని, దీనిపై ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి కమిటీ ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారన్నారు. సమావేశంలో హెచ్ఐవి అవగాహన అంశంపైనా విస్తృతంగా చర్చ జరిగిందని రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో, జాతరలు జరిగే ప్రాంతాల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సభ్యులు సూచించారన్నారు. హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను మరింత మందికి విస్తరించాలని తెలిపారు. ఈ సమావేశంలో వచ్చిన అంశాలపై మరొకసారి కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ శాసనసభ్యులు పీలేరు, సింగనమల, నగిరి, సత్తెనపల్లి, కావలి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రావణి, గాలి భాను ప్రకాష్, కన్నా లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఈ రఘునందన్, డిపిహెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యు డా పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, డి ఎం అండ్ హెచ్ వో బాలకృష్ణ నాయక్ స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, డాక్టర్ శైలజ, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉష కళావత్, రిజిస్టర్ అపర్ణ, డిప్యూటీ రిజిస్టర్ రెడ్డి, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *