తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోనేటి ఆదిమూలం, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ ఆధ్వర్యంలో కోనేటి ఆదిమూలం ఆదేశాల మేరకు 22-1-2026 తేదీన అనగా ఈ గురువారం ఉదయం 8 గంటల నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం(MPDO Office, నాగలాపురం, తిరుపతి జిల్లా, 517589 నందు జాబ్ మేళా నిర్వహించబడును.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈఎంసి క్లస్టర్,శ్రీ సిటీ , తిరుపతి, మరియు చెన్నైలోని 12 బహుళ జాతీయ కంపెనీలలో 700 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని ఎమ్మెల్యే తెలియజేశారు .
ఇందులో భాగంగా సత్యవేడు నియోజకవర్గం లోని లేదా జిల్లా లోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను. మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు అని ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి, తిరుపతి జిల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 21-1-2026. మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.
ఇతర వివరములు కొరకు సంప్రదించండి:9440374535, 9988853335.(కాల్ సెంటర్).
గమనిక : జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకు క్లిక్ చేసి బిల్డ్ యువర్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి ఆధార్ ఓటిపి తో ట్రైనీ రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు సిటిజన్ లాగిన్ ద్వారా మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News