Breaking News

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధత, నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ స్టోరీజ్ సెంటర్, డిస్టిబ్యూషన్ సమయంలో సాయుధ పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, సమీప ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, పోలీస్ శాఖతో అవసరమైన బందోబస్తు ఏర్పాటు కు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం పనులు, మంచినీటి ఏర్పాటుకు మున్సిపల్, పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలు వద్ద వైద్యశిబిరాలు ఏర్పటు చేసి వేసవి దృష్ట్యా డీహైడ్రేషన్ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల విద్యార్ధుల అవసరం మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షల సమయంలో విధ్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జవాబు పత్రాలను ఆలస్యం లేకుండా వెంటనే పోస్ట్ చేసేలా పోస్టల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలు వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ , కాపీయింగ్ జరగకుండా ఇంటర్మీడియట్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. విద్యార్ధులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేలా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తో చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్మీడియట్ ఆర్ఐఓ. జీ సునీత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ థీయరీ పరీక్షలు 23.02.2026 నుంచి 24.03.2026 వరకు ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.. జిల్లాలో మొదటీ సంవత్సరం విద్యార్థులు 34,778 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 31,478 మంది, ద్వితీయ సంవత్సరం బ్యాక్. లాగ్ విద్యార్థులు 834 మంది, మొదటీ సంవత్సరం వోకేషనల్ విద్యార్థులు 707 మంది, రెండవ సంవత్సరం వోకేషనల్ విద్యార్థులు 706 మంది, ద్వితీయ సంవత్సరం వోకేషనల్ బ్యాక్. లాగ్ విద్యార్థులు 448 మంది మొత్తం 68,951 మంది విద్యార్థులు 87 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాయనున్నారని వివరించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 01.02.2026 నుంచి 10.02.2026 వరకు 126 పరీక్ష కేంద్రాల్లోను, ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు 27.01.2026 నుంచి 10.02.2026 వరకు 17 పరీక్ష కేంద్రాల్లోను జరగనున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 27,960 మంది, ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు 2,292 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు బుధవారం (21.01.2026) నైతిక విలువల సబ్జెక్టుపై, శుక్రవారం (23.01.2026) పర్యావరణం సబ్జెక్టు పై పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ అరవింద్ , ఇంటర్మీడియట్ ఆర్ జె డీ పద్మ, ,ఎపిసిపిడిసిఎల్ ఈఈ నాగేశ్వరరావు, ఆర్టీసీ డీపో మేనేజర్ ఎం రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్ నాగవర్ధన్, పోస్టల్ డిపార్ట్మెంట్ పీఆర్ఐ లు వై మాధవరావు, చెన్నకేశవులు, డిఈసీ సభ్యులు జి సిరిల్ పాల్, జానకి రామయ్య, సుబ్బారావు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *