Breaking News

అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. రేపటి నుండి అనగా గురువారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. వినాయక టెంపుల్ నుండి అమ్మవారి దర్శనం వరకు చేసిన క్యూలైన్లను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.క్యూలైన్లలో భక్తులను చేసిన ఏర్పాట్లను పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేసినట్లు మంత్రి అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దేందుకు పర్యవేక్షించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *