విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించారు. గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో బ్రిడ్జింగ్ బోర్డర్స్ రీ ఇమాజినింగ్ ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ యన్ ఎరా ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశం పై సదస్సు లో పత్ర సమర్పణ జరిగింది ఈ సదస్సు లో ప్రొఫెసర్ రామ్ జీ వైస్ ఛాన్సలర్ కృష్ణ యూనివర్సిటీ మాట్లాడుతూ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ లో యువత భాగస్వామ్యం ముఖ్యమని నూతన ఆవిష్కరణలు నూతన పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు గ్లోబలైజేషన్ ప్రభావం భావితరాలకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చాలని యువత నూతన ఆవిష్కరణలు సమైక్యతకు సమగ్రాభివృద్ధికి సాహిత్య సాంస్కృతిక వాదులుగా నిలవాలని తెలిపారు.
కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ గా సిస్టర్ లీన క్వాడ్రస్, ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ, గాదె, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బ్యూలా,మరియు ,ఆంగ్ల విభాగాధిపతి వై.సుప్రియ, డాక్టర్ నితిన్ వర్గీస్ ఆంగ్లవిభాధిపతి, చెంగల్చెరి కేరళ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ కళాశా లనుండి అధ్యాపకులు పాల్గొని పత్ర సమర్పణ చేశారు. డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఆషా, ఉష కుమారి మరియు కెప్టెన్ శైలజ, చరిత్ర మరియు ఆంగ్ల విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News