Breaking News

పురపాలక సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి పురమిత్ర యాప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పురపాలక సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి వీలుగా రూపొందించిన పురమిత్ర యాప్ ని గుంటూరు నగర ప్రజలు విస్తృతంగా డౌన్లోడ్ చేసుకోవాలని, ఇప్పటికే 55,265 మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకొని, రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పురమిత్ర యాప్ ద్వారా షుమారు 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్ లు, చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలను యాప్ ద్వారా పొందవచ్చన్నారు. సేవల కోసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు వాటి పరిష్కార స్తితిని తెలుసుకోవానికి ట్రాకింగ్ కూడా ఉండడంవలన ప్రజలకు తమ సమస్య, లేదా తమ దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చన్నారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి నిర్దేశిత గడువు ఉన్నందున సిబ్బంది కూడా భాద్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కనుక నగర ప్రజలు పురమిత్ర యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *