Breaking News

స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానం నిలుపుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ని నూతన భవనంలోని మీటింగ్ ప్రజా ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024- 25 లో విజయవాడకు సూపర్ స్వచ్ లీగ్ సిటీ పురస్కారం అందుకోవటం గర్వకారణం అని దానికి ముఖ్య కారణం సిబ్బంది చేసిన శ్రమ అని అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 లో కూడా విజయవాడ ను ఉత్తమమైన స్థానం మనం నిలుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూల్ కిట్ ని వివరించారు. దాని కనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయవాడ ను ఉత్తమమైన స్థానంలో నిలిపేందుకు నిరంతర కృషి అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *