Breaking News

ఈ వసంత పంచమి నాడు జ్ఞాన కాంతులను పంచుతూ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ్ఞానానికి, వివేకానికి ప్రతీక అయిన వసంత పంచమీ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, కేంద్ర, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. చంద్ర శేఖర్ ఎమ్మసాని ప్రేరణతో తపాలా శాఖ 4 మరియు 5వ తరగతి చదువుతున్న బడుగు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వసంత పంచమి నాడు అనగా శుక్రవారం ఫిలాటలీ బ్యూరో, విజయవాడ జి.పి.ఒ. కాళేశ్వర రావు మార్కెట్, విజయవాడ వద్ద తపాలా శాఖ నిర్వహించింది. ప్రతి పుస్తకంతో పాటుగ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి (MOS) ప్రేరణాత్మక సందేశాన్ని కలిగి ఉన్న పోస్ట్క్వార్డ్ను ఈ కార్యక్రమమునకు హాజరైన విజయవాడ సిటీ లోని రాజస్తాన్ ఎలిమెంటరీ స్కూల్, గౌతమ్ స్కూల్, నెయింట్ జాన్స్ స్కూల్ మరియు చిత్తూరి స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయుల సమక్షంలో ఇవ్వడం జరిగినది. పిలాటలీ (తపాలా బిళ్ళల సేకరణ), పఠన అలవాట్లయందు ఆసక్తి మరియు జ్ఞాస్ పోస్ట్ సేవ గురుంచి ప్రత్యేక అవగాహనను విద్యార్థుల లో తీసుకు రావడము కోసము తపాల శాఖ ఈ కార్యక్రమము ను నిర్వహించింది.
ఈ కార్యక్రమము లో ఎమ్. నరసింహ స్వామి, సీనియర్ సూపరింటెండెంట్ ఆప్ పోస్టాఫీసెస్, విజయవాడ డివిజన్, విజయవాడ మరియు జి. కరుణాకర బాబు, సీనియర్ పోస్ట్ మాస్టర్, విజయవాడ జి.పి.ఒ. విజయవాడ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *