విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ” ఆధ్వర్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం లో భాగంగా పరాక్రమ్ దివాస్ అనే కార్యక్రమాన్ని K.G.R.L డిగ్రీ కాలేజ్ భీమవరం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ ఇంటి రామచంద్రమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను విద్యార్థులకు తెలిపారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అలవర్చుకోవాల్సిన కొన్ని నాయకత్వ లక్షణాలను విద్యార్థులకు తెలియజేశారు దేశ సైన్యం ఏర్పాట్లు ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు దేశానికి ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమమైనా ముందుండి నడిపించే వారిని అన్నారు అండ్ కాలేజ్ స్టాఫ్ మైభారత్ యువర్ వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News