Breaking News

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్ లు, త్రాగునీరు, పారిశుధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుడదన్నారు. క్యాంటీన్ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *