గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం (ఈ నెల 24వతేదీ) గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’’ థీమ్ తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు, జిఎంసి ఎదురు, పివికే నాయుడు మార్కెట్ లోని టాయ్ లెట్స్ లను శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతుందని, అలాగే నగరంలోని వార్డ్ సచివాలయాల వారీగా కూడా జరిగే కార్యక్రమాల్లో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంధ్రలో భాగంగా వార్డ్ ల వారీగా ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక కార్పోరేటర్ల ఆధ్వర్యంలో వార్డ్ సచివాలయ కార్యదర్శులు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో ర్యాలీ, ప్రతిజ్ఞ, ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వార్డ్ లోని విద్యాసంస్థల్లో విద్యార్ధులకు చేతుల పరిశుభ్రత, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్గించేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
Prajavartha Online Telugu News