
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్ ఆటో వారికి ఆథరైజ్డ్ డీలర్ అయిన వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జనవరి 22, 23 వ తేదీలలో ప్రతిష్టాత్మక పల్సర్ డేర్ ఫెస్ట్ క్యాంపు ని ఆర్టీసీ డిపో వద్ద వున్నా లేబర్ కాలనీ వద్ద నిర్వహించడం జరుగుతుంది.
ఈ క్యాంపు లో బజాజ్ కంపెనీ నూతనంగా విడుదల చేసిన పల్సర్150 ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి బ్లింకర్స్ మరియు న్యూ డెకాల్స్ తో రిలీజ్ చేసిన పల్సర్150 వాహనం మరియు డ్యూయల్ ఛానెల్ ఏ బి ఎస్ టెక్నాలజీ, నైట్రాక్స్ మోనో సస్పెన్షన్, సింగల్ సీట్ (ఫ్యామిలీ రైడింగ్ కి), డిజిటల్ కన్సొల్ లో అద్భుతమయిన ఫీచర్స్ తో విడుదల చేసిన పల్సర్ ఎన్160 వాహనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి వాహనం కొనుగులు మీద 3000/- నుంచి 6000/- వరకూ క్యాష్ ఆఫర్స్ మరియు సెలెక్టెడ్ మోడల్స్ మీద 5 ఫ్రీ సర్వీస్ లు, రూ. 2000/- ఎక్స్చేంజి బోనస్ లాంటి ఆకర్షనీయమయిన ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ కొనుగోలు చేసిన కస్టమర్స్ కి తక్కువ డౌన్ పేమెంట్ మరియు తక్కువ వడ్డీకే వాహన విక్రయలు జరిగాయి. ఈ క్యాంపు లో 35 వాహనాల అమ్మకం జరిగినట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే సర్వీస్ క్యాంపు కూడా నిర్వహించి రూ.299/- కే ఒక లీటర్ ఇంజిన్ ఆయిల్, 7పి సర్వీస్ చేసి, బండికి వాటర్ వాష్ కూడా చేయడం జరిగింది. ఈ సర్వీస్ క్యాంపు లో మొత్తం 250 వాహనాలకి సర్వీస్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బజాజ్ కంపెనీ ఎ ఎస్ ఎం సదత్ బాషా, వరుణ్ మోటార్స్ బిజినెస్ హెడ్ కె.వి.రామారావు, సేల్స్ జిఎం పద్మజ, సిబ్బంది మరియు కస్టమర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News