Breaking News

పేద‌ల‌కు కొండంత అండ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి

-ల‌బ్ధిదారుడికి రూ8.10 ల‌క్ష‌ల‌ సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
-కుటుంబ సభ్యులకి అందజేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమ‌మాహేశ్వ‌ర‌రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకండా, బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పేద కుటుంబాల‌కు కొండంత అండ‌గా నిల‌బ‌డ‌తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద మంజూరైన రూ.8 ల‌క్ష‌ల ప‌దివేల రూపాయ‌ల చెక్కును బాణావ‌త్తు అశోక్ కుమ‌ర్ తండ్రి బాణావ‌త్తు వెంగ‌ళ‌రావుకి అంద‌జేశారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం విస్స‌న్న పేట మండ‌లం చండ్రుప‌ట్ల తండాకి చెందిన బాణావ‌త్తు అశోక్ కుమ‌ర్ అనారోగ్యంతో ఇటీవ‌ల మృతి చెందారు. సీఎంఆర్ ఎఫ్ ద్వారా సాయం అందించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ కి బాణావ‌త్తు వెంగ‌ళ‌రావు, బాణావ‌త్తు ప‌ద్మ‌ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో దూదేకుల ఫైన్షాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంకన్న రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *