విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రంగోత్సవ పోటీలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, సాంస్కృతిక చైతన్యాన్ని నింపే లక్ష్యంతో ఈ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి సుమారు 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానంగా జానపద నృత్యం, పాత్రధారణ (Role Play), చేతిరాత (Handwriting), చిత్రలేఖనం, రంగోలి విభాగాల్లో విద్యార్థులు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఏఎస్పీడీ-1 డాక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్, మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే కళల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాకుండా, సృజనాత్మకత కూడా వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఏఎస్పీడీ-2 కె.రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ప్రదర్శించే ప్రతిభ జీవితాంతం ఒక ఆస్తిలా నిలిచిపోతుందన్నారు. పట్టుదల, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
నోడల్ ఆఫీసర్ శైల కల్పన మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారిలోని సాంస్కృతిక నైపుణ్యాలను ప్రోత్సహించడానికి సమగ్ర శిక్ష నిరంతరం ఇటువంటి వేదికలను కల్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష డిప్యూటీ డైరెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీళ్లే
బహుమతుల వివరాలు
చిత్రలేఖనం
1. చైతన్య తేజ, విశాఖపట్టణం
2. యశ్వంత్, ప్రకాశం
3. యశ్విత, నెల్లూరు
రంగవల్లికలు
1. అక్షయ బృందం – కర్నూలు
2. కార్తీక శ్రీ బృందం – విజయనగరం
3. ఝాన్సీ బృందం – కడప
హ్యాండ్ రైటింగ్
1. శ్రీ లక్ష్మి – గుంటూరు
2. నాగ శాలిని – ప్రకాశం
3. నజరీన్ భాను – చిత్తూరు
ఫోక్ డాన్స్
1. దాక్షాయిని బృందం – విశాఖపట్టణం
2. స్నేహ బృందం – గుంటూరు
3. తానీయా బృందం – నెల్లూరు
రోల్ ప్లే
1. మహేంద్ర బృందం- నెల్లూరు
2. భవ్యశ్రీ బృందం – విజయనగరం
3. ధనశ్రీ బృందం – విశాఖపట్టణం
Prajavartha Online Telugu News