Breaking News

మార్కెట్ విలువ మార్గదర్శక విలువలపై అభ్యంతరాలు / సూచనలు ఆహ్వానం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించబడిన మార్కెట్ విలువ మార్గదర్శక విలువలు (Proposed Guideline Values) తేది: 25-01-2026 నుండి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటిస్ బోర్డులపై మరియు శాఖా అధికారిక వెబ్‌సైట్ www.registration.ap.gov.in లో ప్రజల పరిశీలనార్థం ఉంచబడినవి. ఈ చర్య సర్క్యులర్ మెమో నెం. MV1/752/2022 – జనరల్ రివిజన్, తేది: 22-01-2026, రిజిస్ట్రేషన్ & స్టాంపుల ఇన్‌స్పెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి వారి ఆదేశాల మేరకు చేపట్టబడినది. ప్రతిపాదిత మార్కెట్ విలువ మార్గదర్శక విలువలపై ప్రజల నుండి ఏవైనా అభ్యంతరాలు / సూచనలు ఉన్నట్లయితే, అవి తేది: 29-01-2026 లోగా వ్రాతపూర్వకంగా సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించవచ్చును. ప్రజల నుండి అందిన అభ్యంతరాలు / సూచనలు ఏవైనా ఉన్నచో, వాటిని తేది: 30-01-2026 న నిర్వహించబడనున్న కమిటీ సమావేశంలో పరిశీలించి, తగిన నిర్ణయాలు తీసుకోబడును. అనంతరం తేది: 31-01-2026 న మార్కెట్ విలువ మార్గదర్శక విలువలకు తుది ఆమోదం ఇవ్వబడును. ఈ విధంగా తుది ఆమోదం పొందిన మార్కెట్ విలువ మార్గదర్శక విలువలు తేది: 01-02-2026 నుండి అమల్లోకి వస్తాయి. కావున, సంబంధిత భూ యజమానులు మరియు సాధారణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ అభ్యంతరాలు / సూచనలు గడువులోగా సమర్పించవలసిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *