-అట్కిన్సన్ స్కూల్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే సుజనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీతి నియమాలతో పాటు విలువలతో కూడిన విద్యను వేలాది విద్యార్థినులకు అందించిన ఘనత. అట్కిన్సన్ స్కూల్ యాజమాన్యానికి దక్కిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎట్కిన్సన్ స్కూల్ 126 వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 126 ఏళ్లుగా స్కూల్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యనీకీ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సమాచారం, విజ్ఞానం అలవర్చుకునేందుకే వినియోగించాలని కోరారు. మంచి ఆలోచనతో స్కూల్ పెట్టబట్టి 126 ఏళ్లుగా విద్యార్థినులకు విద్యాభ్యాసం అందించడం ముదవహమన్నారం. విద్యార్థినులు కుల మతాల కతీతంగా మానవత్వమే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఇలాటి సంస్థల్లో అన్నీ కులాలు మతాల వారిని ఆడ పిల్లలను క్రమశిక్షణగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అన్నారు. 16 మంది తో ప్రారంభించిన పాఠశాల 3500 మంది తో ఇపుడు నడపడం యాజమాన్యం విజయమేనని స్పష్టం చేశారు.. కుల మతాలను ఇంట్లో వరకే పరిమితం చేసి బయటకు వచ్చాక మానవత్వమే ముఖ్యంగా ప్రతిఒక్కరు మిగతా వారికి సాయపడాలనీ పిలుపునిచ్చారు. ఇలాటి స్కూల్స్ లో చదవటం వల్లనే నేను ఈరోజు మీముందు ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడే అవకాసం వచ్చిందన్నారు. విద్యార్థులు పెద్దలు మాట విని విజ్ఞానం పెంపొందించు కోవాలన్నారు. భారత మాతను కాపాడేందుకు అందరూ రేపటి పౌరులుగా మారాలనీ పిలుపునిచ్చారు. నేను వ్యక్తిగతంగా, సుజనా ఫౌండేషన్ తరపున ప్రభుత్వం తరపున గానీ స్కూల్ కి అవసరం అయిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా అని భరోసా ఇచ్చారు . కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతి ప్రధానం చేశారు. స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా సుజనా చౌదరి నీ ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News