– పార్కుల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నాం
– గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నారని కేశినేని శివనాద్ చిన్ని అన్నారు. శనివారం ఉదయం ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో ఎలక్ట్రిసిటీ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాద్ చిన్ని మరియు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ పాల్గొని ఎలక్ట్రిసిటీ పార్కును ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారని ప్రజలు దీన్ని వినియోగించి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతిరోజు తమ కార్యచరణలో భాగంగా ప్రజలు ఓపెన్ జిమ్నీ వినియోగించి ఫిట్ గా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభలు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ విస్తృతంగా పార్కుల ఏర్పాటు చేపడుతుందని అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ కాలనీలో ఓపెన్ జిమ్ పార్క్ ను ఇవాళ ప్రారంభించినందుకు తమకే ఎంతో ఆనందంగా ఉందని ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే అది నిజమైన అభివృద్ధి అని అన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గిస్తూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ 16.72 లక్షల వ్యయంతో ఎలక్ట్రిసిటీ కాలనీలో ఎలక్ట్రిసిటీ పార్కును నిర్మించారని తెలిపారు. కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఆనందంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో 13 వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని వెంకట ప్రసాద్, శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News