Breaking News

స్వచ్ఛ నగరంగా విజయవాడ ఎప్పుడు ముందు ఉండాలి – కేశినేని శివనాథ్ (చిన్ని), పార్లమెంట్ సభ్యులు

-ప్రతి ఒక్కరు వ్యర్ధాల నుండి సంపద సృష్టించాలి – గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ నగరంగా విజయవాడ ఎప్పుడు ముందు ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ను ఎల్లప్పుడు స్వచ్ఛ నగరంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం వలన ప్రజలలో స్వచ్ఛతపై అవగాహన కలగటమే కాకుండా వారి దినచర్యలో ఒక భాగమైపోయిందని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సహకరిస్తుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై బాధ్యతగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే వ్యర్థాలను విభజించి, పారిశుధ్య కార్మికులకు అందించాలని, ఇంటింటి వ్యర్ధాల సేకరణ జరిగేటప్పుడు ఇటువంటి వ్యర్ధాలు ఇచ్చినచో వ్యర్ధాల నుండి సంపద సృష్టించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జీరో గ్యాప్ శానిటేషన్ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోటు లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. తదుపరి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్ ను సందర్శించారు. అందులో భాగంగా పర్యావరణహితమైన వస్తువులను వాడాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం దానికి ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన గుడ్డ సంచులను వాడాలనే అవగాహన కల్పించే స్టాల్స్ ను సందర్శించారు. తదుపరి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ కె. షమ్మీ అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్వచ్ఛత ర్యాలీ ను జెండా ఊపి ప్రారంభించారు. నగరపాలక సంస్థ సిబ్బంది, స్వచ్చంద్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, ర్యాలీలో పాల్గొని స్వచ్ఛత నినాదాలు పలుకుతూ పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 13 వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని వెంకట ప్రసాద్, శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *