Breaking News

గత వైసీపీ సైకో పాలన రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది

-చంద్రబాబు నాయకత్వంతో మళ్లీ వెలుగుల బాట
-కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాళాకోరుతనానికి నిదర్శనం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ శక్తి (ఉచిత బస్సు)పథకం, ఉచిత ఇసుక, డీఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పింఛన్ల పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల స్థాపన ఇవన్నీ కూటమి ప్రభుత్వమే చేసిన ఘనతలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసారు. ఈ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాళాకోరు తనానికి నిదర్శనం అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. సర్వేల పేరుతో, పుస్తకాల పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి, భూమి హక్కు పత్రాలపై తన ఫోటోలు వేసుకుని చరిత్ర సృష్టించానని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. భూమి హక్కు పత్రాలపై ఫోటోలు ఎందుకు..భూమి మీద హక్కా… ఫోటో మీద హక్కా.. అంటూ ప్రతిపక్షాన్ని ఎండగట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తూన్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతున్న నాయకుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు.

గతంలో టెక్నాలజీని అవహేళన చేసిన వైసీపీ నాయకులే, ఈ రోజు అదే టెక్నాలజీ రాష్ట్ర సంపదను పెంచుతోందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారని తెలిపారు.

వైసీపీ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసిన మంత్రి, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైన, పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధన ఉత్పత్తుల దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

ప్రభుత్వ కృషితో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారని,.
2024 వరకూ రాష్ట్రంలో భయంకరమైన సైకో, రాక్షస పాలన నడిచింది. అక్రమ కేసులు పెట్టి, కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా జైలుకు పంపిన దుర్మార్గపు పాలన అది అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి సంక్షేమాన్ని అమలు చేస్తూనే అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. నరకాసురుడు లాంటి చెడ్డ పాలకులు మళ్లీ సమాజానికి నష్టం చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32 వేల కోట్ల కరెంటు ఛార్జీలు పెంచి, లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. గత పాలకులు విధించిన రూ.4,600 కోట్ల డ్యూటీని ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కరెంటు ఛార్జీలు పెంచలేదని, ఇది సమర్థ నిర్వహణ వల్లే సాధ్యమైందన్నారు.

ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి లేదా సరఫరాకు రూ.5.19 ఖర్చవుతున్నా, ప్రజలపై భారం పడకుండా 39 పైసలకు యూనిట్ ఖర్చు తగ్గించామని, త్వరలో మరో రూ.1.20 మేర కొనుగోలు భారాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, అనుభవం, పరిపాలనా నైపుణ్యంతోనే ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *