అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు సహా అసెంబ్లీ భవనాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో రాత్రి సమయంలో ఆభవనాలన్నీ విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి.ఆయా భవనాలతో పాటు అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరువైపుల గల రహదారులు, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో సచివాలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో ఒక పండుగ వాతావరణం నెలకొంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే మొదటి భవనాన్ని త్రివర్ణ పతాక వర్ణం ఉట్టిపడేలా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.అదే విధంగా సచివాలయ ప్రైవేశ మార్గానికి సమీపంలోని ఐదవ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కూడా ఇదే రీతిలో అలంకరించడంతో ఈ భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడలో గల లోక్ భవన్, ఉండవల్లి లోని ముఖ్యమంత్రి వర్యుల క్యాంపు కార్యాలయం సహా ప్రకాశం బ్యారేజ్,ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల భవనాలు ప్రముఖ కట్టడాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
Prajavartha Online Telugu News