Breaking News

పద్మ పురస్కారాలు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు నా శుభాభినందనలు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలు రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వారందరికీ నా అభినందనలు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, యూజీసీ మాజీ ఛైర్మెన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు పద్మశ్రీ, అలాగే  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన సినీనటులు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ (కళలు), మాగంటి మురళీ మోహన్ (కళలు), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం)  (కళలు), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశుసంవర్ధక, పాడి పరిశ్రమ), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం), గూడూరు వెంకట్రావు (వైద్యం), దీపికారెడ్డి (నృత్యకారిణి), గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్)లకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు జాతి ఖ్యాతి మరింతగా వెలుగొందాలని, ఈ అవార్డులు అందరికీ స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *