Breaking News

బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో తోకల రామకృష్ణ

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత చైతన్య యువజన పార్టీ జనవరి 26 సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ కైకలూరు నియోజకవర్గం నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా రామకృష్ణ భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. అనంతరం తోకల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారు ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్న వాస్తవానికి మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన కులాల వారికి స్వాతంత్రం ఇంకా రాలేదని అన్నారు. చట్టసభలలో, ఆర్థిక, రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం, సమానత్వం కల్పించిన రోజున మనం సాధించుకున్న ఈ స్వతంత్రానికి అర్థం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా స్త్రీలను పురుషులతో సమానంగా చూసి చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించిన రోజు ఈ రాజకీయ అసమానతలు, కుల అసమానతలు తొలగిపోతాయని అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించే విషయంలో ముందుండే ఏకైక పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని తెలియజేశారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బీసీవై పార్టీ అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించడంలో తమ వంతు కృషి చేస్తానని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో తోట శివరామ్ ప్రసాద్, కే.చాముండేశ్వరి దేవి, వి.ఎస్.ఎన్. ప్రసాద్, మట్టా శివ, ఆకుల జయకళ్యాణి, మీగడ నాగరాజు, బత్తుల జయరాజు, బత్తుల రమణయ్య, కట్టెబోయిన వెంకటేశ్వరరావు బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *