విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్ శాఖ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి విజయవాడ నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ నక్క వీరభద్ర రావు అధ్యక్ష వహించారు. దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయవాడ నగర ఏఐటీయూసీ కార్యదర్శి కామ్రేడ్ మూలి సాంబశివరావు ప్రసంగించారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్ష సాధింపుగా 28 చట్టాల్ని ఉపసంహరించి కొత్తగా నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అయిన కాడికి కార్పొరేట్ వారికి ఊడిగం చేస్తుంది కార్మికులను అణచివేసే ధోరణి అవలంబిస్తుంది మొత్తం కార్పొరేట్ విధానాలకు లోబడి అంబానీ ఆదానీలకు దాసోహం చేస్తుంది ఉద్యోగ భద్రత లేదు సమాన పనికి సమాన వేతనం లేదు నిరుద్యోగ భృతి లేదు అన్ ఎంప్లాయిమెంట్ పెరిగిపోతుంది యువత పెడదోవన పడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వాలు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 36వ డివిజన్ శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ నక్క వీరభద్ర రావు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించిన సుధీనం గణతంత్ర దినోత్సవం అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు, ప్రజాసేవ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News