Breaking News

గణతంత్ర దినోత్స‌వ వేడుకలలో ప్రదర్శించిన శకటాలు అభివృద్ధి ప్ర‌యాణాన్ని అద్భుతంగా చాటిచెప్పాయి.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్స‌వ వేడుకలలో ప్రదర్శించిన శకటాలు అభివృద్ధి ప్ర‌యాణాన్ని అద్భుతంగా చాటిచెప్పాయి. మొత్తం 18 శాఖ‌ల శ‌క‌టాలు స్వ‌ర్ణాంధ్ర ప‌ది సూత్రాల కార్యాచ‌ర‌ణను క‌ళ్ల‌కుక‌ట్టాయి.  దుర్గామ‌ల్లేశ్వర స్వామివార్ల దేవ‌స్థానం, స్వ‌ర్ణాంధ్ర 2047 (దార్శ‌నిక ప్ర‌ణాళిక‌లు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (పేద‌రికం లేని స‌మాజం), పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌, సంస్థ (దీపం-2 ప‌థ‌కం), ప‌ర్యాట‌క శాఖ (కొండ‌ప‌ల్లి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌), పాఠ‌శాల విద్యాశాఖ (విలువ ఆధారిత విద్య‌), ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ఈగ‌ల్ (మాద‌క‌ద్ర‌వ్య ర‌హిత జిల్లా, న‌వోద‌యం 2.0), వైద్య ఆరోగ్య శాఖ (ఆరోగ్యంగా జీవిద్దాం.. ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సాధిద్దాం), జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ (బాల్య వివాహ విముక్త్ భార‌త్‌), స‌క్షం అంగ‌న్వాడీ), నీటి పారుద‌ల శాఖ (నీటి భ‌ద్ర‌తా ప్ర‌ణాళిక‌, జ‌ల‌మే జీవ‌నం), అట‌వీ శాఖ (వ‌న మ‌హోత్స‌వం), వ్య‌వ‌సాయం (ప్ర‌కృతి సేద్యం), పంచాయ‌తీరాజ్ (స్వ‌ర్ణాంధ్ర‌, స్వ‌చ్ఛాంధ్ర‌), ప‌శుసంవ‌ర్థ‌క, ఉద్యాన‌, ఏపీ ఎంఐపీ (రైత‌న్న ఇంట సిరుల పంట‌), విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ (ప్ర‌జా సేవ‌లో), ర‌వాణా శాఖ (ర‌హ‌దారి భ‌ద్ర‌త‌), అగ్నిమాప‌క శాఖ (విప‌త్తు నిర్వ‌హ‌ణ సేవ‌లో) శ‌క‌టాలు ఆక‌ట్టుకున్నాయి.
విజేత‌లు:
1. మొద‌టి బ‌హుమ‌తి: విద్యాశాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ ఉమ్మ‌డిగా
2. వైద్య ఆరోగ్యం, డీఆర్‌డీఏ
3. ప‌ర్యాట‌కం; ఎక్సైజ్‌, ఈగ‌ల్‌
ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి: పౌర స‌ర‌ఫ‌రాలు, మ‌హిళా శిశు సంక్షేమం, ప‌శు సంవ‌ర్థ‌క‌, ఉద్యాన‌, ఏపీ ఎంఐపీ

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *