విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు ద్వారా భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యం, మహనీయుల త్యాగాలు, దేశ కీర్తి శిఖరాల సమర్థతను, ప్రతిభను ప్రతిబింబించాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసే ప్రదర్శనలు ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను రేకెత్తించాయి.
ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్ (సత్యనారాయణపురం), శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ (సింగ్‌నగర్), డీఎస్ఎంసీ హైస్కూల్ (విద్యాధరపురం), కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ, పావని నరేంద్ర కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ, బిషప్ అజరయ్య బాలికల హైస్కూల్ చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది.
విజేతలు:
మొదటి బహుమతి: డీఎస్ఎంసీ హైస్కూల్ (విద్యాధరపురం), కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ
ద్వితీయ బహుమతి: పావని నరేంద్ర కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ,
తృతీయ బహుమతి: ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్ (సత్యనారాయణపురం), శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ (సింగ్‌నగర్)
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
Tags vijayawada
Check Also
కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …
Prajavartha Online Telugu News