Breaking News

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శాఖల స్టాల్ల్స్ సందర్శించిన ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఎస్పీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్ల్స్‌ను ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు – RTIH, బ్యాంకులు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు, DRDA–MEPMA, ఐసిడిఎస్ (ICDS), మత్స్య సంపద, రెవెన్యూ శాఖ, SC, BC & ST సంక్షేమ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ల్స్‌ను వారు పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్ద ప్రదర్శించిన పథకాలు, సేవలు, లబ్ధిదారులకు అందిస్తున్న ప్రయోజనాలు, స్టాల్ల్స్ ఏర్పాటు విధానం తదితర అంశాలను సంబంధిత శాఖాధికారులు ఇంచార్జి జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి వివరించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా స్టాల్ల్స్‌ను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *