Breaking News

బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పని విధానం కోసం ఒకరోజు జాతీయ సమ్మె

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక వన్ టౌన్ లోని ఆర్ఆర్ అప్పారావు వీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎపిటిబిఈఎఫ్ సెక్రటరీ కామ్రేడ్ బి. వడయవర్లు మాట్లాడుతూ గత రెండు నెలలుగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐబీఏ చైర్మన్ ఆర్థిక మంత్రి కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించడం, నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం అలాగే సైకిల్ ర్యాలీలు, జన చైతన్య యాత్ర, జన జాగృతి యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా జనవరి 22, 23 న నిర్వహించిన సయోధ్య సమావేశాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో 27 జనవరి దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధికారులు సమ్మెలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల మీద పనిభారం అనేది ఎక్కువగా ఉందని ఆ ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని లేనిపక్షంలో తమ నిరసనలు మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కామ్రేడ్ వెంకట సుబ్బయ్య, సమన్వయ కమిటీ అధ్యక్షులు ఎన్. సుబ్బారావు,  కె.వి.ఎస్. ఎస్. రవికుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎపిటిబిఈఎఫ్ కె. రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు, సంజయ్ రామ్ బెల్లారి, సెక్రటరీలు, ఎపిటిబిఈఎఫ్, అలాగే ఏ.బి.వి.ఎల్. నరసింహం, ఎఐబిఒఎ, బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *