Breaking News

యువగళం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా 70 ఆటోల పంపిణీ

-వీటితో దాదాపు 400 కుటుంబాలకు జీవనాధారం, ఆర్థిక ఉపాధి
-రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర
-కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువగళం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా కేవలం సంబరాలు మాత్రమే కాకుండా, కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా అండగా ఉండాలన్న లక్ష్యంతో 70 ఆటోలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు శారద కాలేజ్ వద్ద విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్మిక సోదరులకు ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ (APBOCWA) ఛైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఆటోలు అందించడం జరుగుతుందన్నారు. ఏపీబీవోసీడబ్లూఏ ఛైర్మన్‌ రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధానంగా యువగళం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 70 ఆటోలను కార్మికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రఘురామరాజు ఆధ్వర్యంలో 70 ఆటోలను కార్మికులకు అందించడం ద్వారా సుమారు 300 నుండి 400 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అబద్ధాలని, అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 3132 కిలోమీటర్లు, 226 రోజుల పాటు సాగిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిందన్నారు. రాష్ట్రానికి గూగుల్ సంస్థలాంటి పెట్టుబడులు రావడానికి ఆయన కృషే కారణమని పేర్కొన్నారు. తన పాదయాత్ర లో 120 నియోజకవర్గాల్లో పర్యటించి కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలను చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినప్పుడు ప్రాణాలకు తెగించి రఘురామరాజు అడ్డుకున్నారని కొనియాడారు. కార్మికులకు ఇన్సూరెన్స్, తక్కువ వడ్డీకి రుణాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు సాధించడంలో రఘురామరాజు కృషి ఎంతో ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు.

పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర ద్వారా రఘురామరాజు, మంత్రి వాసంశెట్టి సుభాష్ వంటి ఎంతోమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి, నేడు కార్పొరేటర్లుగా, ఎంపీలుగా, ఇతర కీలక పదవుల్లో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకోవడానికి అనేక ఆటంకాలు కల్పించినా, కేసులు పెట్టినా మంత్రి లోకేష్ వెనకడుగు వేయలేదని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మంత్రి లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో చిన్న విరామం వచ్చినా, తర్వాత అది రికార్డు స్థాయిలోనే కొనసాగిందని చెప్పారు. విజయవాడ నగరంలో పాదయాత్ర ప్రవేశించినప్పుడు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని, అది ఒక చరిత్రగా నిలిచిపోతుందని కొనియాడారు. ఇదే సందర్భంలో రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సుమారు 70 ఆటోలను పంపిణీ చేస్తున్నట్లు, అందులో భాగంగా 50 ఆటోలను ఇప్పటికే ఇస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో యువత అంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు.

ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ (APBOCWA) ఛైర్మన్‌, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి, ప్రతి ఏటా ₹15,000 ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమన్నారు. యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆటో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఆటోలు అందించడం గర్వంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా నిలుస్తుందన్నారు.

తదనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆటో కార్మికుల కుటుంబాలకు ఆటోలను అందించారు. అనంతరం ఆ ఆటోల్లో వారితోపాటు ప్రయాణించారు.

ఆటోల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా, దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగూల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా ఎల్డీఎమ్ కే. ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్ సీహెచ్. సత్య కరుణ, తదితర బ్యాంకు అధికారులు, కార్మిక సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *