విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ 49 వ డివిజన్ ప్రైజర్ పేట కి చెందిన బోగవల్లి గాయత్రి లివర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోంది.. వైద్యులను సంప్రదించడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.. ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్తానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ సహకారంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు.. ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి తో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖను అందించారు.. దానికి సంబంధించిన 2,01,000/_ ఎల్వోసీ పత్రాన్ని గాయత్రి భర్తకు అంద చేశారు.. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు రత్నకుమారి, అప్పాజీ, రాఘవ, పెదబాబు, టీడీపీ నాయకులు ఫతావుల్లా, తదితరులు పాగొన్నారు..
Prajavartha Online Telugu News