విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పోర్ట్స్ వేర్ తయారీలో పేరెన్నిగన్న ప్రఖ్యాత సంస్ధ ఆర్ ఆర్ స్పోర్స్ ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ దుస్తుల తయారీ రంగానికి పరిమితమైన ఈ కంపెనీ తాజాగా రిటైల్ రంగంలో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇంతవరకు మగవారికి మన్నికగల స్పోర్ట్స్ వేర్ ను అందిస్తూ ఆదరణ చూరగొన్న ఆర్ఆర్ స్పోర్ట్స్…పెస్టల్స్ బ్రాండ్ పేరుతో లేడీస్ అండ్ కిడ్స్ స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ ద్వారా గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఆర్ ఆర్ స్పోర్ట్స్ కంపెనీ విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఎక్స్ క్లూజివ్ బ్రాండెడ్ ఔట్ లెట్ ను ప్రారంభించింది. గాంధీనగర్ స్వామి స్ట్రీట్ లో ఆర్ఆర్ స్పోర్ట్స్ తొలి, అతి పెద్ద షోరూంను జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను ప్రారంభించారు. పెస్టల్స్ బ్రాండ్ ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంచ్ చేశారు. ముఖ్య అతిథులుగా విజయవాడకు చెందిన అథ్లెట్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ జ్యోతిక శ్రీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ హాజరయ్యారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో కీలకమైన విజయవాడ కేంద్రంగా 30 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతున్న ఆర్ఆర్ స్పోర్ట్స్..మేకిన్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 2వేలకు పైగా మల్టీ బ్రాండెడ్ స్టోర్ లలో కూడా స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ ను అందుబాటులోకి తెచ్చింది. మూడు దశాబ్దాలుగా వినియోగదారులతో ప్రత్యేక అనుబంధం ఉన్న తమ కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్ తో ప్రజల ముందుకు వచ్చిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత తరుణంలో ఆర్ ఆర్ స్పోర్ట్స్ బ్రాండ్ కు మరింత ఆదరణ లభిస్తుందన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత శ్రేణి వరకు అందుబాటు ధరలలో ఆర్ ఆర్ స్పోర్ట్స్ వేర్ తో పాటు పెస్టల్స్ బ్రాండ్ దుస్తులు లభిస్తాయని చెప్పారు. ఎక్స్ క్లూజివ్ బ్రాండెడ్ ఔట్ లెట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యువ క్రీడాకారిణి జ్యోతిక శ్రీ, చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ ను ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
Tags vijayawada
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …