-విద్యార్థిని అభినందించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధాయ్ ల్యాండ్ లో జరగనున్న బీచ్ కుస్తీ పోటీలకు దేశం తరపున ఎంపికైన డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్దిని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం 9 వ తరగతి విద్యార్ది ఆర్. శివ మల్లిఖార్జున 2026 జనవరి 23 నుంచి 26 వరకు విశాఖలో జరిగిన రాష్ట్ర స్ధాయి బీచ్ కుస్తీ పోటీల్లో ప్రధమ స్ధానంలో నిలిచి గోల్డ్ మెడల్, జాతీయ స్ధాయిలో సిల్వర్ మెడల్ సాధించి ఈ ఏడాది మార్చిలో ధాయ్ లాండ్ లో జరగున్న కుస్తీ పోటీలకు దేశం తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి శివ మల్లికార్జున ఎంపికయ్యాడు. ఈ సంధర్బంగా బుధవారం వెలగపూడి సచివాలయంలో విద్యార్దిని మంత్రి డిఎస్ బీవీ స్వామి అభినందించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం పేద విద్యార్దులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించంటంతో పాటు క్రీడలను ప్రోత్సాహిస్తోందన్నారు. పేద విద్యార్దులు మట్టిలో మాణిక్యాలని వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్బుతాలు సృష్టిస్తారన్నాని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
Prajavartha Online Telugu News