గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న ప్రభుత్వ వైద్యశాలలో కానూరి-జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్ర నూతన భవన ప్రారంభోత్సవానికి రానున్నందున సదరు పర్యటన మార్గంలో జిఎంసి నుండి చేపట్టాల్సిన రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జిజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరిగే పెరేడ్ గ్రౌండ్ నుండి జిజీహెచ్ వరకు పారిశుధ్యం, ఆక్రమణల తొలగింపు, ప్యాచ్ వర్క్ లు చేపట్టడానికి, పర్యవేక్షణకు విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లకు విధులు కేటాయించామని, అందుకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంపాలెం మెయిన్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ ని తొలగించాలని, రోడ్, డివైడర్ల పక్కన మట్టి కుప్పలు లేకుండా చూడాలన్నారు. జిజిహెచ్ పరిసరాల్లో అక్కడి ప్రజారోగ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రదానంగా డ్రైన్లు శుభ్రం చేయాలని, సెంట్రల్ మీడియన్స్, ఐలాండ్స్ శుభ్రంగా ఉంచాలన్నారు. నిర్మాణ వ్యర్ధాలను, రోడ్ల వెంబడి ఉన్న ట్రావెల్స్, ఇతర పార్కింగ్ వాహనాలను తొలగించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. పర్యటనలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News