-కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపం లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహణ
-సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా గ్రామీణ విలేఖరులకు రెండు రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల లోని కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపం లో ఈ నెల 31, ఫిబ్రవరి నెల 1 వ తేదీల్లో ఈ పునశ్చరణ తరగతులునిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా వివిధ అంశాలపై గ్రామీణ విలేఖరులకు తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పునశ్చరణ తరగతుల ప్రారంభ సమావేశాలలో జిల్లా కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్., జిల్లా పోలీసుసూపరింటెండెంట్ బి. ఉమా మహేశ్వర్ ఐ.పి. ఎస్. లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపారు.
తొలి రోజు (31-01-26) ఉదయం ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్, స్టేట్ బ్యూరో శ్రీశైలం రమేష్ “క్రైమ్ రిపోర్టింగ్” అంశం పై ప్రసంగిస్తారు. సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య “పత్రికా భాష ” పై ప్రసంగిస్తారు. అనంతరం “కృత్రిమ మేధ” (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) అంశం పై సీనియర్ జర్నలిస్ట్ విజయకుమార్ కుర్రా ప్రసంగిస్తారు.
రెండవరోజు (01-02-26) సీనియర్ జర్నలిస్టు డి. సోమ సుందర్, భారత రాజ్యాంగం పత్రికా చట్టాలు అంశం పై ప్రసంగిస్తారు. అనంతరం కె. ఎల్. యూనివర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీ, వాసిరెడ్డి వాసంతి జర్నలిజంలో నైతిక నిష్ఠ, డెవలప్మెంట్ జర్నలిజం అంశం పై, ఆర్. టివి ఎ.పి. ఇన్పుట్ ఎడిటర్, కృష్ణ మోహన్ “ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ లో మెళకువలు” అంశం పై ప్రసంగిస్తారు. అనంతరం ప్రజాశక్తి దిన పత్రికసంపాదకులు, తులసీదాస్ రూరల్ రిపోర్టింగ్ లో మెళకువలు అంశం పై ప్రసంగిస్తారు
Prajavartha Online Telugu News