Breaking News

మిషన్ వాత్సల్యతో చిన్నారుల భవిష్యత్కు బాట చూపండి..

-జిల్లాలో బిషన్ వాత్సల్య కింద 551 మందికి ఆర్ధిక సహాయం..
-కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య కింద జిల్లాలో 551 మందికి ఆర్ధిక సహాయం చేసి చిన్నారుల భవిష్యత్కు బాట చూపడం జరిగిందని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

మిషన్ వాత్సల్య జిల్లా స్పాన్సర్షివ్ అండ్ పోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లోని ఏవిఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో మిషన్ వాత్సల్య లక్ష్యాలు, పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్ధిక సహకారం, శిశు సంరక్షణ పథకాలు తదితరాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. హెచ్ఐవి పిల్లలు, కోవిడ్ ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు నిరాటకం కలగకుండా మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 551 మంది పిల్లలకు ఆర్ధిక సాయం అందించామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా వీరికి ఆర్ధిక సహాయం అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత, శిశు మద్దతు కార్యకలాపాలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.

సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట డైరెక్టర్ రుక్సానా సుల్తానా బేగం, ప్రొటెక్షన్ ఆఫీసర్ జాన్సన్, డిసిపియు క్రాఫ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. ఫ్రాన్సిస్ తంబి మేనేజర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *